close

తాజా వార్తలు

Published : 21/10/2020 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లాక్‌డౌన్‌లో కంపెనీలను మోసం చేయాలనుకున్నారు

రెట్టింపైన యత్నాలు

ముంబయి: లాక్‌డౌన్‌ మొదలైన ప్రారంభ రోజుల్లో కంపెనీలను మోసం చేయడానికి చేసిన ప్రయత్నాలు రెట్టింపయ్యాయని ఓ నివేదిక తెలిపింది. అదే సమయంలో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలయ్యాక అవి తగ్గుతూ వచ్చాయని అమెరికాకు చెందిన ట్రాన్స్‌యూనియన్‌ సంస్థ తెలిపింది. మార్చి 11-మే 18 మధ్య భారత కంపెనీలపై ఆన్‌లైన్‌ మోస ప్రయత్నాలు జనవరి 1 - మార్చి 10తో పోలిస్తే 121 శాతం పెరిగాయి. అయితే వ్యాపారాలు తిరిగి కార్యకలాపాలు మొదలుపెట్టే సమయానికి(మే 19-జులై 25) ఆ యత్నాల్లో 29 శాతం క్షీణత కనిపించిందని ఆ సంస్థ వివరించింది. కంపెనీలన్నీ ఆన్‌లైన్‌లోకి వెళ్లాలని ప్రయత్నించడాన్ని ఆసరాగా చేసుకుని లబ్ది పొందాలని మోసగాళ్లు భావించారు. అయితే కంపెనీలు చేపట్టిన భద్రతా చర్యల వల్ల విజయవంతం కాలేకపోయారని తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.