close

తాజా వార్తలు

Updated : 27/09/2020 16:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ వారం ఐపీవోకు యూటీఐ ఏఎంసీ..!


ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలోనే రెండో అతిపెద్ద అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ యూటీఐ ఈవారం ఐపీవోకు రానుంది. సెప్టెంబర్‌ 29న ఈ కంపెనీ బిడ్లను స్వీకరించనుంది. రూ.10 ముఖవిలువ కలిగిన 3.8 కోట్ల వాటాలను ఈ ఐపీవోలో విక్రయించనుంది. దీనిలో షేర్‌ ప్రైస్‌బ్యాండ్‌ రూ.552 - రూ.554 మధ్య ఉంటుందని అంచనా. ప్రజలు యూటీఐ ఐపీవో మీద చాలా ఆసక్తితో ఉన్నారు. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారం అత్యధిక లాభాలను పంచుతుందోని లెక్కలు చెబుతున్నాయి.  హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ 12.8 శాతం లాభంతో, నిప్పన్‌ ఏఎంసీ 9శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఈ ఐపీవోలో యూటీఐ షేర్లకు ఎంత డిమాండ్‌ ఉందనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఇదే రంగంలోని తోటి సంస్థల కంటే తక్కువ విలువకు రావడంతో యూటీఐ ఏఎంసీకి మంచి ఆదరణే లభించవచ్చని ఈ రంగంలోని నిపుణులు అంచనావేస్తున్నారు. 

లాట్‌ సైజు ఎంత..?

ఈ ఐపీవోలో 27 షేర్లను ఒక లాటుగా విక్రయించనున్నారు. కనీసం ఒక లాటు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. షేర్ల కంటే అధిక బిడ్లు వస్తే.. కేటాయించిన వారి పేర్లను అక్టోబర్‌ 7న ప్రకటించవచ్చు. అక్టోబర్‌ 12నాటికి యూటీఐ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టుకానున్నాయి. ఈ ఇష్యూ నుంచి అత్యధికంగా రూ.2,160 కోట్లను సేకరించాలని  యూటీఐ భావిస్తోంది. ఈ ఇష్యూ తర్వాత ప్రమోటర్ల వాటా  100శాతం నుంచి 69.2శాతానికి తగ్గనుంది. 

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.