close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120026863 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => ZkfNZrAUIxQ [video_short_link] => ZkfNZrAUIxQ [created_by] => [created_date] => [modified_by] => 963258741 [modified_date] => 2020-02-25 17:17:58.133435 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

నేను ఓడితే.. మార్కెట్లు పతనమే: ట్రంప్‌

దిల్లీ: భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి చర్చలు పురోగతిలో ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అన్నారు. దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో ట్రంప్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌, ఆదిత్య బిర్లాగ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా  సహా పలువురు పారిశ్రామికవేత్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

ఆరేడు నెలల్లో ఒప్పందం..

‘భారత్‌లో అద్బుతమైన స్వాగతం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ దేశంతో వాణిజ్య ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయి. దానికంటే ముందు కొన్ని చట్టపరమైన అడ్డంకులను అధిగమించాల్సి ఉంది. మరో ఆరేడు నెలల్లో ఒప్పందం రూపుదాల్చనుంది’ అని ట్రంప్‌ తెలిపారు. 

నేను ఓడితే.. మార్కెట్లు పతనమే

‘గత ఎన్నికల్లో అమెరికాలో రిపబ్లికన్లకు స్పష్టమైన ఆధిక్యం రావడంతో సంస్కరణలకు అవకాశం దక్కింది. ఒబామా కేర్‌ను మించిన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం తెచ్చాం. సరైన వ్యక్తులను ఎన్నుకుంటేనే ఆర్థిక పురోభివృద్ది సాధ్యమవుతుంది. లేదంటే నిరుద్యోగం పెరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో కూడా తప్పకుండా మేమే గెలుస్తామన్న విశ్వాసం ఉంది. నేను గెలిస్తే మార్కెట్లు మరింత పుంజుకుంటాయి. వెయ్యి పాయింట్లకు పైగా లాభపడతాయి. ఒకవేళ ఓడిపోతే మునుపెన్నడూ లేనంతగా మార్కెట్లు పతనమవుతాయి’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. 

కరోనా అదుపులోకి..

‘ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌పై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడా. వైరస్‌ను ఎదుర్కొనేందుకు చైనా శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. కరోనా విషయంలో చైనాలో పరిస్థితి అదుపులో ఉన్నట్లే కన్పిస్తోంది. వైరస్‌ను నిలువరించేందుకు అమెరికా పూర్తి సంసిద్ధంగా ఉంది’ అని ట్రంప్‌ చెప్పారు. 

మోదీ చాలా ప్రత్యేకం..

‘భారత్‌కు రావడం గర్వంగా భావిస్తున్నారు. మీకు చాలా అద్భుతమైన ప్రధాని (మోదీని ఉద్దేశిస్తూ) ఉన్నారు. ఆయన చాలా ప్రత్యేకం. తాను ఏం చేస్తున్నాను అనే దానిపై మోదీకి స్పష్టమైన అవగాహన ఉంది. అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు. మేం ఇక్కడ ఉద్యోగాలు సృష్టిస్తే.. ఆయన మీ ద్వారా అమెరికాలో ఉద్యోగాలు సృష్టిస్తున్నారు’ అని మోదీపై ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. 

ఇవీ చదవండి..

ఈ బంధం ప్రజలది..:మోదీ

మూడు బిలియన్‌ డాలర్ల రక్షణ ఒప్పందాలు: ట్రంప్‌

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.