close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120047173 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1247616214769086465 [video_short_link] => 1247616214769086465 [created_by] => [created_date] => [modified_by] => 8917202 [modified_date] => 2020-04-08 14:16:19.16833 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 08/04/2020 14:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

కరోనానిధికి సంపదలో 28 శాతం: ట్విటర్‌ సీఈఓ 

1 బిలియన్‌ డాలర్లు ఇచ్చిన జాక్‌ డోర్సీ

సాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)పై జరుగుతున్న యుద్ధానికి మద్దతుగా ట్విటర్‌ సీఈఓ జాక్‌ డోర్సీ భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించే చర్యలకు చేయూతగా 1 బిలియన్‌ డాలర్లను ఇస్తున్నట్టు తెలిపారు. తన ఆన్‌లైన్‌ ఆర్థిక సేవల సంస్థ ‘స్క్వేర్’ నుంచి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్టు జాక్‌ డోర్సీ వివరించారు. కాగా ఈ మొత్తం జాక్‌ సంపదలో 28 శాతం కావటం గమనార్హం. 

కరోనా సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా ఈ మొత్తాన్ని తను స్థాపించిన సేవా సంస్థ  ‘స్టార్ట్‌ స్మాల్‌’కు జాక్‌ డోర్సీ తరలించారు. తన సేవా కార్యక్రమాలన్నీ పారదర్శకంగా ఉంటాయని ఆయన తెలిపారు. స్టార్ట్‌ స్మాల్‌కు అందిన డబ్బు ఏఏ సేవా సంస్థలకు వెళ్తుందో ప్రజలందరూ తెలుసుకోగలిగేలా ఓ లింక్‌ను కూడా ఆయన షేర్‌ చేశారు. గతంలో కూడా తాను 40 మిలియన్‌ డాలర్లను గుప్తంగా దానం చేశానని తెలిపారు. ఇక నుంచి తాను చేసే సేవా కార్యక్రమాలన్నీ పారదర్శకంగానే ఉంటాయని జాక్‌ వెల్లడించారు..

స్క్వేర్‌ నుంచి ఎందుకు?   
తాను ప్రకటించిన విరాళాన్ని ట్విటర్‌ నుంచి కాకుండా స్క్వేర్‌ నుంచి ఎందుకు ఇచ్చారు అనే సందేహానికి సమాధానంగా... స్క్వేర్‌లో తనకు ఎక్కువ వాటా ఉందని అందుకే తాను ఇలా చేశానని ఆయన వివరించారు. రానున్న కాలంలో తాను సంస్థ అమ్మకాలను మరింత వేగవంతం చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. కష్టకాలంలో ప్రజలకు సహాయపడటానికి తాను తీసుకున్న ఈ నిర్ణయం, దీర్ఘకాలంలో రెండు కంపెనీలకూ ప్రయోజనం చేకూరుస్తుందని ట్విటర్‌ నుంచి వైదొలగనున్న జాక్‌ డోర్సీ తెలిపారు.

ప్రస్తుతం కరోనాను ఎదుర్కోనేందుకు ప్రపంచానికి సహాయం అత్యవసరం అంటూ...ఈ సహాయం జీవితకాలం పాటు ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. తన చర్య ఇతరులను కూడా ప్రభావితం చేస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. జీవితం చాలా చిన్నదని... సమాజానికి సహాయం చేయటానికి ఏ రోజు ఏ అవకాశం దొరికినా దానిని వినియోగించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. కొవిడ్‌-19 బెడద తొలగిన అనంతరం తాను బాలికల విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై దృష్టిసారిస్తానని ట్విటర్‌ సీఈఓ వివరించారు.

 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.