close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 09/07/2020 23:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మార్కెట్లోకి ఎస్‌యూవీ కరొల్లా క్రాస్‌..!

థాయ్‌లాండ్‌: జపాన్‌కు చెందిన కార్ల తయారీ దిగ్గజం టొయోటా కరొలా క్రాస్‌ ఎస్‌యూవీని ప్రపంచ విపణిలోకి విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని థాయ్‌ల్యాండ్‌లో నిర్వహించింది.  కొత్త ఎస్‌యూవీ విక్రయాలను మొదలుపెట్టింది. ఈ ఎస్‌యూవీ భారత్‌లో విక్రయించేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. త్వరలోనే ఇతర మార్కెట్లో కూడా విక్రయాలు చేపడతామని కంపెనీ పేర్కొంది.  
టొయోటాకు చెందిన కరోలా మోడల్‌ కారులో భారీ మార్పులు చేసి ఎస్‌యూవీ లుక్‌ తీసుకొచ్చారు. వినియోగదారుల అంచనాకు మించి ఈ కారు పనితీరు ఉంటుందని కంపెనీ చెబుతోంది. దీని తయారీకి కంపెనీ టీఎన్‌జీఏ*1 ప్లాట్‌ఫామ్‌ను వాడింది.  దీనిలో భద్రతా ప్రమాణాలు కరోలా సెడన్‌ను పోలిఉంటాయని పేర్కొంది. టొయోటా చీఫ్ ఇంజినీర్‌ డైజో కమియామ మాట్లాడుతూ ‘‘ కరోలా క్రాస్‌ ఇప్పుడు కొత్తగా కరోలా కుటుంబంలోకి వచ్చింది. మా వినియోగదారులు ఈ కారును కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు. 

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.