stock market: స్వల్ప లాభాల్లో మార్కెట్‌ సూచీలు - Sensex gains
close

Updated : 24/06/2021 09:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

stock market: స్వల్ప లాభాల్లో మార్కెట్‌ సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.16 గంటల సమయంలో సెన్సెక్స్‌ 174 పాయింట్ల లాభంతో 54,480 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 15,724 వద్ద ట్రేడవుతున్నాయి. గుజరాత్‌ ఫ్లోరో కెమికల్స్‌, సాతియా ఇండస్ట్రీస్‌, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌, సాగర్‌ సిమెంట్‌, రత్నమాలా మెటల్స్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. రామ్‌కో సిస్టమ్స్‌, నిర్లాన్‌, రిలయన్స్‌ పవర్‌, అదానీ టోటల్‌, హింద్‌ కన్‌స్ట్రక్షన్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఐటీ సూచీ అత్యధికంగా 0.85శాతం లాభాల్లో ఉండగా.. చమురు, గ్యాస్‌ సూచీ అత్యధికంగా 0.40శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ  7 పైసలు కుంగి రూ. 74.12గా ఉంది. ఎమ్‌సీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.39 పెరిగి రూ.47,050గా, వెండి కిలో ధర రూ.416 పెరిగి రూ.67,931 వద్ద ఉన్నాయి. 

నేడు శ్యామ్‌ మెటాలిక్స్‌, సోనా కామ్‌స్టార్‌ షేర్లు కొత్తగా మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి. ఇప్పటికే ఈ షేర్లకు గ్రేమార్కెట్‌లో డిమాండ్‌ ఉండటంతో.. మంచి లాభాల్లో లిస్ట్‌ కావచ్చనే అంచనాలు ఉన్నాయి. నేడు మొత్తం 97 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఓఎన్‌జీసీ, అశోక్‌ లేల్యాండ్‌, మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌, వెస్ట్‌కోస్ట్‌ పేపర్‌ మిల్స్‌ కంపెనీలు వీటిల్లో ఉన్నాయి. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని