close

తాజా వార్తలు

Published : 31/10/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రైవేటు కంపెనీలకు రూ.30,000 కోట్లు

పేద దేశాల్లో కొవిడ్‌పై పోరాటానికి రుణాలిచ్చిన ఐఎఫ్‌సీ

ముంబయి: కొవిడ్‌ పరిణామాలను ఎదుర్కోడానికి పేద దేశాల్లోని ప్రైవేటు రంగ కంపెనీలకు 400 కోట్ల డాలర్ల(దాదాపు రూ.30,000 కోట్లు) రుణాలిచ్చినట్లు ద ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఎఫ్‌సీ) తెలిపింది. వర్థమాన దేశాల్లోని ప్రైవేటు రంగ కంపెనీలపై ఈ అతిపెద్ద అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ దృష్టి సారిస్తుంటుంది.మొత్తం 800 కోట్ల డాలర్ల రుణాలను ప్రైవేటు కంపెనీలకు వేగంగా అందించాలని మార్చిలో ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఇప్పటిదాకా 400 కోట్ల డాలర్ల రుణాలు ఇచ్చినట్లు ఐఎఫ్‌సీ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ మెంగిస్తు అలెమయెహు ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌లో ఎన్ని రుణాలిచ్చిందీ తెలపలేదు. అయితే డీసీఎమ్‌ శ్రీరామ్‌కు 4 కోట్ల డాలర్ల(దాదాపు రూ.300 కోట్లు) రుణాన్ని ఇచ్చినట్లు తెలిపారు. 2019-20లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రైవేటు కంపెనీలు, ఆర్థిక సంస్థల్లో ఐఎఫ్‌సీ మొత్తం 22 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.