close
Array ( ) 1

తాజా వార్తలు

తొలి 5జీ ఫోన్‌ వచ్చేసింది!

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ రియల్‌మీ భారత్‌లో తన తొలి 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. భారత్‌లో విడుదలైన తొలి 5జీ ఫోన్‌ కూడా ఇదే. రియల్‌ ఎక్స్‌ 50 ప్రో పేరిట దీన్ని సోమవారం ఆ కంపెనీ విడుదల చేసింది. దీని ధర, స్పెసిఫికేషన్స్‌పై ఓ లుక్కేద్దాం పదండి..

రియల్‌మీ ఎక్స్‌50 ప్రో 5జీ 6జీబీ/128జీబీ వేరియంట్‌ ధరను ఆ కంపెనీ రూ.37,999గా నిర్ణయించింది. 8జీబీ/128జీబీ వేరియంట్‌ ధరను రూ.39,999 గానూ, 12జీబీ/256జీబీ వేరియంట్‌ ధరను రూ.44,999గానూ పేర్కొంది. నేటి (ఫిబ్రవరి 24) నుంచే వీటి అమ్మకాలు ప్రారంభమవుతున్నాయి. మాస్‌ గ్రీన్‌, రస్ట్‌ రెడ్‌ రంగుల్లో ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ.కామ్‌ వెబ్‌సైట్లలో ఈ ఫోన్‌ లభిస్తోంది.

స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే రియల్‌మీ ఎక్స్‌50 ప్రో ఆండ్రాయిడ్‌ 10తో కూడిన రియల్‌మీ యూఐతో పనిచేస్తుంది. 6.44 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ 90Hz రీఫ్రెష్‌ రేట్‌ కలిగిన సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. కార్నింగ్‌ గొరిల్లా 5 ప్రొటెక్షన్‌ ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ అమర్చారు. వెనుక వైపు 64ఎంపీ శాంసంగ్‌ జీడబ్ల్యూ1 సెన్సర్‌తో పాటు 8ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 12 ఎంపీ టెలీఫోటో సెన్సర్‌, 2 ఎంపీ పోట్రెయిట్‌ కెమెరా ఉన్నాయి. ముందు వైపు 32 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 616 కెమెరాను అమర్చారు. అదనంగా 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ సెకండరీ కెమెరాను వినియోగించారు. 5జీ కనెక్టివిటీతో పాటు 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్‌ 5.1, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకతలు. 4,200 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ 65W సూపర్‌ డార్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.