close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 30/05/2020 02:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్‌ఐఎల్‌-ఆర్‌ఈలకు గిరాకీ

తొలి రోజు ట్రేడింగ్‌తో పోలిస్తే 41% వృద్ధి

ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ -రైట్స్‌ ఎంటైటిల్‌మెంట్‌ (ఆర్‌ఐఎల్‌-ఆర్‌ఈ) షేర్లు తొలి ట్రేడింగ్‌ ధరతో పోలిస్తే శుక్రవారం 41% పైన ట్రేడయ్యాయి. మే 20న తొలి ట్రేడింగ్‌ రూ.158 వద్ద మొదలైంది. కేవలం 7 ట్రేడింగ్‌ రోజుల్లో 41 శాతం పైన పెరిగి (శుక్రవారం ముగింపు ధర రూ.223) మదుపర్లకు మంచి విలువ సంపాదించి పెట్టాయి. ఆర్‌ఐఎల్‌ మదుపర్లు ఈ రూపంలో మొత్తంగా రూ.9,425 కోట్ల మేర సంపాదించుకోగలిగారు. శుక్రవారం మార్కెట్‌ ముగింపు నాటికి 4.8 లక్షల ఆర్‌ఈలు ఇంకా ఎన్‌ఎస్‌ఈలో కొనుగోలు వైపు పెండింగ్‌లో ఉండగా, విక్రయం వైపు 2.4 లక్షలు మాత్రమే ఉండటం గమనార్హం. అంటే ఇంకా ఆర్‌ఐఎల్‌-ఆర్‌ఈలకు డిమాండ్‌ ఉన్నట్లే లెక్క. 7 ట్రేడింగ్‌ రోజుల్లో 300 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,243 కోట్లు) 11.4 కోట్ల ఆర్‌ఈలు (మొత్తం రైట్స్‌ ఇష్యూలో 27 శాతం) చేతులు మారాయి. ఆర్‌ఐఎల్‌-ఆర్‌ఈ ట్రేడింగ్‌, రైట్స్‌ ఇష్యూ ప్రారంభంతోనే మే 20న మొదలైంది. జూన్‌ 3న ముగియనుంది. ఈలోపు ఆర్‌ఈ ఎంటైటిల్‌ కలిగిన యజమాని రూ.314.25 (కొంత భాగం) చెల్లించి ఒక ఆర్‌ఐఎల్‌ షేరుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మెగా రైట్స్‌ ఇష్యూ ద్వారా ఆర్‌ఐఎల్‌ రూ.53,125 కోట్ల నిధుల్ని సమీకరించబోతోంది. ప్రతి 15 ఆర్‌ఐఎల్‌ షేర్లు కలిగిన మదుపర్లకు రూ.1,257కే ఒక షేరును కేటాయించబోతోంది. ఇలా 15 షేర్లు కలిగిన అర్హులైన మదుపర్ల డీమ్యాట్‌ ఖాతాల్లోకి ఇప్పటికే 1 ఆర్‌ఈని కేటాయించిన సంగతి తెలిసిందే. ఎవరి దగ్గరైతే షేర్లు లేవో వారు ఈ ఆర్‌ఈలను కొనుగోలు చేసి రైట్స్‌ ఇష్యూకు దరఖాస్తు చేసుకొనే వీలుండటంతో వీటికి గిరాకీ పెరిగింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.