close

తాజా వార్తలు

Published : 23/05/2020 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాపై ఆర్‌బీఐ యుద్ధం ఇలా..

భారత్‌లో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) తొలి కేసు జనవరి 30న నమోదు కాగా.. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు, వ్యాఖ్యలు..
ఫిబ్రవరి 6: చైనాలో కరోనా వ్యాప్తి గురించి ప్రస్తావించింది. ముడి చమురు ధరలు తగ్గుతాయని అంచనా వేసింది. కరోనా కారణంగా ఈక్విటీ మార్కెట్‌ ప్రతికూలంగా చలించొచ్చని తెలిపింది.
మార్చి 3: మార్కెట్‌ ఊగిసలాటల నేపథ్యంలో కొవిడ్‌-19 పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు అవసరమైనపుడు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
మార్చి 6: కరోనా నుంచి ఎదురవుతున్న సవాళ్లకు భారత్‌ సిద్ధంగా ఉందని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. అవసరమైతే ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటుందని వివరించారు.
మార్చి 16: కార్యకలాపాలు, వ్యాపార కొనసాగింపు చర్యలు చేపట్టమని బ్యాంకులకు లేఖ రాసింది. కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించడం ఇందుకు నేపథ్యం.
మార్చి మధ్యలో: ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు రహస్య ప్రాంతంలో ఆర్‌బీఐ అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
మార్చి 27: రెపో రేటును 75 బేసిస్‌ పాయింట్లు; సీఆర్‌ఆర్‌లో 100 బేసిస్‌ పాయింట్ల మేర కోత వేసింది. రూ.1 లక్ష కోట్లను వ్యవస్థలోకి జొప్పించేందుకు లాంగ్‌ టర్మ్‌ రెపో కార్యకలాపాల(ఎల్‌టీఆర్‌ఓ)ను ప్రారంభించింది. మూడు నెలల పాటు అన్ని రుణ చెల్లింపులపై మారటోరియానికి అనుమతులు ఇచ్చింది.
ఏప్రిల్‌ 3: మనీ మార్కెట్‌ ట్రేడింగ్‌ సమయాన్ని ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరిమితం చేసింది.
ఏప్రిల్‌ 17: రివర్స్‌ రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించడంతో పాటు ఇతర చర్యలూ తీసుకుంది. నాబార్డ్‌, సిడ్బి, నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌లకు రూ.50,000 కోట్ల మేర ప్రత్యేక ఆర్థిక సదుపాయాన్ని ప్రకటించింది.
ఏప్రిల్‌ 27: మ్యూచువల్‌ ఫండ్‌లకు రూ.50,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సదుపాయాన్ని ప్రకటించింది.
మే 22: రెపో రేటులో మరో 40 బేసిస్‌ పాయింట్ల మేర కోత విధించింది. అన్ని బ్యాంకు రుణాల చెల్లింపులపై మరో 3 నెలల మారటోరియాన్ని ప్రకటించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.