close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 07/07/2020 15:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెడ్‌మీ నోట్‌9 ప్రో పోలికలతో పోకో ఎం2 ప్రో

ఇంటర్నెట్‌డెస్క్‌: స్వతంత్ర బ్రాండ్‌గా అవతరించిన పోకో.. భారత మార్కెట్‌లోకి తన మూడో ఫోన్‌ను విడుదల చేసింది. పోకో ఎం2 ప్రో పేరిట మంగళవారం లాంచ్‌ చేసింది. ఇంతకుముందు పోకో ఎఫ్‌1, పోకో ఎక్స్‌2 పేరిట ఫోన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ ఫోన్‌ ఫీచర్స్‌ ఏంటి? ధరెంత లాంటి వివరాలపై లుక్కేద్దాం!

మార్చిలో షావోమి విడుదల చేసిన రెడ్‌మీ నోట్‌ 9 ప్రోను.. పోకో ఎం2 ప్రో పోలి ఉంటుంది.  పంచ్‌ హోల్‌ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్‌ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది.  4జీబీ/64జీబీ వేరియంట్‌ ధర రూ.13,999 గానూ, 6జీబీ/64జీబీ వేరియంట్‌ ధరను రూ.14,999గానూ, 6జీబీ/ 64జీబీ వేరియంట్‌ ధరను రూ.16,999 గానూ కంపెనీ నిర్ణయించింది. బ్లూ, బ్లాక్‌, గ్రీన్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. జులై 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

స్పెసిఫికేషన్స్‌...
పోకో ఎం2 ప్రో స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్‌ 10 ఓఎస్‌ ఆధారిత ఎంఐయూఐ 11తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ ఉంటుంది. ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 720జీ ప్రాసెసర్‌ ఉంది. వెనుకవైపు నాలుగు కెమెరాలున్నాయి. 48 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 8+5+2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందువైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఉంది. మెమొరీ కార్డుతో 512 జీబీ వరకు మెమొరీని పెంచుకోవచ్చు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 33w ఫాస్ట్ ‌ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

< script> var truepush = win dow.truepush || []; truepush.push(functi on () { truepush .Init({ id: "5e9021 767f1a31bbf7 453611" }, function (e rror) { if (error) co nsole.error ( error); }) })