close

తాజా వార్తలు

ఉత్పత్తి పెంచిన మారుతీ సుజుకీ

దిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) వాహనాల ఉత్పత్తిని పెంచింది. నవంబర్‌లో 4.33 శాతం మేర అదనంగా వాహనాలను ఉత్పత్తి చేసింది. డిమాండ్‌లేమి కారణంగా గత తొమ్మిది నెలలుగా వాహనాల ఉత్పత్తిని తగ్గిస్తూ వచ్చిన ఆ కంపెనీ.. తొలిసారి ఉత్పత్తిని పెంచడం గమనార్హం. నవంబర్‌ నెలలో మొత్తం 1,41,834 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆ కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో ఆ కంపెనీ 1,35,946 యూనిట్లను ఉత్పత్తి చేసింది.

ప్రయాణికుల వాహనాలను నవంబర్‌లో 1,39,084 యూనిట్లను ఉత్పత్తి చేయగా.. గతేడాది నవంబర్‌లో ఈ సంఖ్య 1,34,149 యూనిట్లుగా ఉంది. 3.67 శాతం మేర అదనంగా వాహనాలను ఉత్పత్తి చేసింది. అలాగే యుటిలిటీ వాహనాలు, మిడ్‌ సైజ్‌ సెడాన్‌, లైట్‌ కమర్షియల్‌ వాహనాల ఉత్పత్తిని కూడా పెంచింది. మినీ, కంపాక్ట్‌ సెగ్మెంట్‌ కార్ల ఉత్పత్తిని మాత్రం తగ్గించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో వాహన ఉత్పత్తిని 20.7 శాతం తగ్గించి 1,19,337 యూనిట్లను, సెప్టెంబర్‌లో 17.48 శాతం తగ్గించి 1,32,199 యూనిట్లను మాత్రమే మారుతీ సుజుకీ ఉత్పత్తి చేసింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.