close

తాజా వార్తలు

Published : 21/10/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎన్‌సీసీ లిమిటెడ్‌లో వాటా పెంచుకున్న రేఖా ఝున్‌ఝున్‌వాలా

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సంస్థ అయిన ఎన్‌సీసీ లిమిటెడ్‌లో అగ్రశ్రేణి ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా భార్య, రేఖా ఝున్‌ఝన్‌వాలా వాటా పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ వెల్లడించిన వాటాదార్ల వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. రేఖా ఝున్‌ఝున్‌వాలా ఈ ఏడాది జూన్‌- సెప్టెంబరు త్రైమాసికంలో అదనంగా 42.25 లక్షల షేర్లు కొనుగోలు చేశారు. దీంతో ఈ కంపెనీలో ఆమె వాటా 9.55 శాతం నుంచి 10.24 శాతానికి పెరిగింది. ఆమెకు ఇప్పుడు మొత్తం 6.24 కోట్ల షేర్లు ఉన్నట్లు అవుతోంది. అదే సమయంలో ఈ కంపెనీలో రాకేష్‌ ఝున్‌ఝన్‌వాలా వాటా మాత్రం స్ధిరంగా 1.9 శాతం (1.16 కోట్ల షేర్లు) వద్ద ఉండిపోయింది. మరోపక్క మ్యూచువల్‌ ఫండ్ల వాటా స్వల్పంగా తగ్గింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.