close

తాజా వార్తలు

‘కియా’ లోగో మారుతుందా..?

సియోల్‌: దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్‌ తన లోగోను మార్చుకొనే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ కంపెనీ కొత్త లోగో కోసం కొరియా ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ (కేఐపీఆర్‌ఐఎస్‌)కు దరఖాస్తు చేసుకొంది. స్టైలిష్‌గా తయారు చేసిన 2డీ కార్పొరేట్‌ లోగోను నలుపు, ఎరుపు రంగుల్లో సిద్ధం చేసింది. ఈ లోగోకు ఇప్పటి వరకు స్థానక సంస్థల నుంచి అనుమతులు రాలేదు. ఇప్పటికే కియా పలు సార్లు ఈ లోగోను ప్రదర్శించింది. ఇటీవల జెనీవా ఆటోషో సందర్భంగా ప్రదర్శించిన ఫ్యూచరాన్‌ కాన్సెప్ట్‌ కారుపై ఈ లోగో ఉంది.

కియా బ్రాండ్‌కు కొత్త కార్పొరేట్‌ గుర్తింపు తెచ్చేందుకు లోగో ఉపయోగపడుతుందని కంపెనీ భావిస్తోంది. దీంతోపాటు ఐసీఈ యేతర ఇంజిన్లను అభివృద్ధి చేయడంపై కంపెనీ దృష్టిపెట్టింది. ఈ కొత్త లోగోను భవిష్యత్తులో వచ్చే విద్యుత్తు వాహనాల కోసం ఉపయోగించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో ఫోక్స్‌ వ్యాగన్‌ కూడా 2019 జెనీవా ఆటోషోలో సరికొత్త కార్పొరేట్‌ లోగోను ప్రదర్శించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.