close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 30/05/2020 03:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సన్‌ఫార్మా కొవిడ్‌ ఔషధం క్లినికల్‌ పరీక్షలకు అనుమతి

దిల్లీ: కొవిడ్‌ చికిత్సకు ఉపయోగించడం కోసం నఫామోస్టాట్‌ మెసిలేట్‌పై క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి సన్‌ఫార్మాకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతులు ఇచ్చింది. పాంక్రియాటిస్‌ లక్షణాల నుంచి మెరుగుపడడానికి; రక్తం గడ్డకట్టకుండా చేసే(డీఐసీ) చికిత్సకు ఉపయోగించడానికి నఫామోస్టాట్‌కు జపాన్‌లో అనుమతులు ఉన్నాయి. ‘ఐరోపా, జపాన్‌, దక్షిణ కొరియాలోని మూడు స్వతంత్ర శాస్త్రవేత్తల బృందాలు జరిపిన పరిశోదనల్లో కొవిడ్‌-19పై నఫామోస్టాట్‌ మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. అందువల్లే కరోనా రోగుల చికిత్సకు దీనిని ఉపయోగించడంపై సన్‌ఫార్మా పరిశోధిస్తోంద’ని కంపెనీ ఎండీ దిలీప్‌ సంఘ్వి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఔషధం మంచి ఫలితాలను ఇస్తుందన్న విశ్వాసం తమకుందని ఆయన అన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.