close

తాజా వార్తలు

హోండా బీఎస్‌6 లక్ష యూనిట్ల అమ్మకాలు

ముంబయి: ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా.. బీఎస్‌ 6 యాక్టివా ద్విచక్రవాహనాల అమ్మకాల్లో లక్ష యూనిట్ల మైలురాయి అధిగమించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. గత సెప్టెంబర్‌లో హోండా తమ సంస్థ నుంచి మొట్టమొదటి బీఎస్‌ 6 వాహనం యాక్టివా 125ని, ఆ తర్వాత ఎస్పీ 125, అనంతరం ఈ ఏడాది ఆరంభంలో యాక్టివా 6జీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. బీఎస్‌ 6 అధునాతన ఇంజిన్లతో ఈ మూడు రకాల ద్విచక్రవాహనాలను సంస్థ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ బీఎస్‌ 6 వాహనాలను విడుదల చేసినప్పటి నుంచి కేవలం నాలుగు నెలల్లో లక్ష యూనిట్లు అమ్మినట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ కల్లా బీఎస్‌ 6 వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశించింది. దీంతో ఆ గడువుకు ముందే బీఎస్‌ 6 వాహనాలను మార్కెట్‌లో అందుబాటులో ఉంచేందుకు హోండా సంస్థ సిద్ధమైంది. ఈ వాహనాలు కేవలం పనితీరులోనే కాకుండా మైలేజీ విషయంలోనూ మంచి ఫలితాల్ని ఇస్తాయని సంస్థ తెలిపింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.