close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 30/05/2020 02:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హెచ్‌సీఎల్‌ టెక్‌ ఆధీనంలోకి సిస్కో ‘సన్‌’ టెక్నాలజీ

రూ.377.93 కోట్లకు కొనుగోలు

దిల్లీ: సిస్కోకు చెందిన సెల్ఫ్‌ ఆప్టిమైజింగ్‌ నెట్‌వర్క్‌ (సన్‌) టెక్నాలజీని ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 50 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.377.93 కోట్లు) కొనుగోలు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. సన్‌ అనేది మల్టీ-వెండార్‌, మల్టీ-టెక్నాలజీ సొల్యూషన్‌. ఇది 2జీ-5జీ కమ్యూనికేషన్‌ కోసం రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్స్‌ను (ఆర్‌ఏఎన్‌) ఆప్టిమైజ్‌ చేస్తుంది. ఇది ఖాతాదార్ల పని తీరును పెంచేందుకు, ఆర్‌ఏఎన్‌ను కలిగిన బహుళ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేసేందుకు, ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాల సామర్థ్యాలను పెంచేందుకు సహాయపడుతుందని, దీంతో మూలధన-నిర్వహణ వ్యయాలు చాలా వరకు తగ్గుతాయని హెచ్‌సీఎల్‌ టెక్‌ వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా సిస్కో ‘సన్‌’ టెక్నాలజీలో పని చేస్తున్న కొంత మంది ఉద్యోగులు కూడా హెచ్‌సీఎల్‌కు మారతారని తెలిపింది. 2021 జనవరి కల్లా ఈ ఒప్పందం పూర్తవుతుందని పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.