close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 06/06/2020 03:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పీఎస్‌యూల ప్రైవేటీకరణపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది

ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌

దిల్లీ: సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూలు) ప్రైవేటీకరించే విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ వెల్లడించారు. గత నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.20 లక్షల కోట్ల ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ ప్యాకేజీ ప్రకటించే సమయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు వీలుగా వ్యూహాత్మక రంగాల్లో గరిష్ఠంగా 4 ప్రభుత్వ రంగ కంపెనీలు ఉండేలా, మిగతా ప్రభుత్వ కంపెనీలను దశల వారీగా ప్రైవేటీకరిస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై గురువారం చర్చలు ప్రారంభమయ్యాయి. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కొంచెం కష్టమైన పనే. అయితే ఈ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. వ్యూహాత్మకేతర పీఎస్‌యూలను ఎప్పుడు వీలైతే అప్పుడు విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంద’ని వర్చువల్‌ ఏఐఎమ్‌ఏ కార్యక్రమంలో పాల్గొన్న సంజీవ్‌ సన్యాల్‌ వివరించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.