close

తాజా వార్తలు

Updated : 29/10/2020 19:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైరస్‌ వల.. పసిడి గిరాకీ వెలవెల

ముంబయి: ఓ వైపు కొవిడ్‌ విజృంభణ, ఆర్థిక వ్యవస్థ మందగమనం.. మరోవైపు రెక్కలొచ్చిన ధరలు.. ఫలితంగా దేశంలో బంగారం గిరాకీ అంతకంతకూ పడిపోయింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో 30శాతం తగ్గి 86.6 టన్నులకు పరిమితమైంది. 2019 ఇదే త్రైమాసికంలో పుత్తడి డిమాండ్‌ 123.9 టన్నులుగా ఉంది. నగల గిరాకీ కూడా 48శాతం తగ్గి 52.8టన్నులకు పడిపోయింది. ఈ మేరకు ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ నివేదిక వెల్లడించింది. 

కొవిడ్‌ 19తో లాక్‌డౌన్‌ అమల్లోకి రావడం, అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్చితి వల్ల ధరలు అమాంతం పెరగడంతో పసిడి గిరాకీ తగ్గిందని డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోమసుందరం తెలిపారు. సాధారణంగా జులై - సెప్టెంబరు త్రైమాసికంలో శ్రావణమాసం పెళ్లిళ్లు, పండగలతో బంగారం కొనుగోళ్లు విపరీతంగా ఉండేవి. అయితే ఈ సారి వైరస్‌ భయంతో పెళ్లిళ్లు, పండగలు అంతంతమాత్రంగానే జరిగాయి. మరోవైపు భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం వంటి కొవిడ్‌ ఆంక్షలతో వినియోగదారులు బంగారం రిటైల్‌ దుకాణాలకు వెళ్లేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా మూడో త్రైమాసికంలో పసిడికి గిరాకీ తగ్గిందని సోమసుందరం చెప్పారు. 

అయితే ఏప్రిల్‌-జూన్‌తో పోలిస్తే.. మూడో త్రైమాసికంలో కాస్త మెరుగైన డిమాండ్‌ లభించినట్లు ఆయన తెలిపారు. రెండో త్రైమాసికంలో పసిడి డిమాండ్‌ ఏకంగా 70శాతం పడిపోయి 64 టన్నులకు పరిమితమైంది. మరోవైపు కొనుగోళ్లు తగ్గినప్పటికీ పసిడిలో పెట్టుబడులు పెరగడం గమనార్హం. జులై-సెప్టెంబరులో భారత్‌లో బంగారం పెట్టుబడులు 52శాతం పెరిగి 33.8 టన్నులుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితులతో పసిడిలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని మదుపర్లు భావించారు. దీంతో పసిడి బాండ్లు, ఈటీఎఫ్‌లకు డిమాండ్‌ పెరిగింది. 

ప్రస్తుతం కొవిడ్‌ పరిస్థితులు చక్కబడుతుండటంతో పాటు దసరా, ధనత్రయోదశి, దీపావళిని పురస్కరించుకుని నాలుగో త్రైమాసికంలో పసిడి కొనుగోళ్లు మళ్లీ పెరిగే అవకాశముందని సోమసుందరం తెలిపారు. 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.