close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 08/07/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పియా జియో ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం

 వాణిజ్య వాహన పరిశ్రమలో ఇదే మొదటిది

కోల్‌కతా: ఇటలీకి చెందిన పియా జియో గ్రూప్‌ అనుబంధ సంస్థ పియా జియో వెహికల్స్‌(పీవీపీఎల్‌) తన వాణిజ్య వాహనాల కోసం సరికొత్త ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. భారత వాణిజ్య వాహన పరిశ్రమలో ఈ తరహా ప్లాట్‌ఫాం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటికే ఈ సంస్థ తన ద్విచక్ర వాహనాల శ్రేణి కోసం జూన్‌ 10, 2020న ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఇపుడు తాజాగా తన వాణిజ్య వాహన బ్రాండ్‌ ‘అపె’ కోసం కొత్త వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో పియా జియోకు చెందిన అన్ని వాణిజ్య వాహన డీలర్‌షిప్‌లను ఏకీకృతం చేస్తారు. ‘వినియోగదార్లు ఈ పోర్టల్‌ ద్వారా సులువుగా వివరాలను తెలుసుకోవచ్చు. అంతే కాదు రూ.1000 కట్టి ఆన్‌లైన్‌లో వాహనాన్ని బుక్‌ చేసుకోవచ్చు. ఆన్‌ రోడ్‌ ధర, ఈఎమ్‌ఐ లెక్కింపు వంటి వివరాలు; రుణానికి దరఖాస్తు కూడా ఇందులోనే చేసుకునే వీలుంద’ని పియా జియో వెహికల్స్‌ సీఎండీ డియాగో గ్రాపి పేర్కొన్నారు. షో రూముకు రాకుండానే వినియోగదార్లు తమకు నచ్చిన మోడల్‌ను బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.