close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 11/07/2020 06:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జూన్‌ నుంచే ఆర్థిక రికవరీ మొదలైంది

 మారటోరియం పొడిగింపు అక్కర్లేదు
 ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌

కోల్‌కతా: కరోనా సంక్షోభం వల్ల తలెత్తిన అవాంతరాల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం జూన్‌ నుంచే మొదలైందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ అండ్‌ ఎకనామిక్స్‌ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రికవరీ సరళిని చూడాలంటే మరో మూడు నుంచి నాలుగు నెలలు ఎదురుచూడాలని అన్నారు. ‘భారత ఆర్థిక వ్యవస్థకు కొవిడ్‌-19 భారీ విఘాతంగా మారింది. సరఫరా వ్యవస్థ మొత్తం చెల్లాచెదురైంది. ఏప్రిల్‌ అత్యంత దారుణంగా ఉండగా, మేలో కొంచెం మెరుగయ్యాం. జూన్‌ నుంచి రికవరీ మొదలైంది’ అని రజనీశ్‌ కుమార్‌ అన్నారు. కరోనా వల్ల పారిశ్రామికంగా ముందంజలో ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ ప్రభావితం అయ్యాయని తెలిపారు. ఆగస్టు 31 తర్వాత రుణ చెల్లింపులపై విధించిన మారటోరియంను పొడిగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. కొన్ని రంగాలపై ఎక్కువగా ప్రభావం పడిందని, ఈ విషయంలో ఆర్‌బీఐ సరైన విధానం అవసరమని వివరించారు. కరోనా సంక్షోభం వల్ల ఎన్‌పీఏలు పెరిగినట్లు ఎస్‌బీఐ గణాంకాలు స్పష్టం చేశాయని, అయితే వీటిని బ్యాంక్‌ భరించగలదని అన్నారు. రిటైల్‌, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ రంగాల్లో మారటోరియంను ఎక్కువగా ఎంచుకున్నారని చెప్పారు. కార్పొరేట్‌ సంస్థలు నగదు నిల్వలు దాచుకోవడానికి మారటోరియంను ఎంచుకున్నాయని, రుణ చెల్లింపులు చేయలేక కాదని వెల్లడించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.