close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 08/07/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమెజాన్‌ సెల్లర్‌ సర్వీసెస్‌కు మరో రూ.2310 కోట్ల పెట్టుబడి

దిల్లీ: అమెజాన్‌ సెల్లర్‌ సర్వీసెస్‌కు రూ.2310 కోట్ల తాజా పెట్టుబడిని అమెరికా దిగ్గజ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ అందచేసింది. అమెజాన్‌ కార్పొరేట్‌ హోల్డింగ్స్‌, అమెజాన్‌.కామ్‌.ఇన్‌క్‌ సంస్థలు ఈ నిధులను అందించాయి. ఇందుకోసం కావాల్సిన తీర్మానాన్ని అమెజాన్‌ సెల్లర్‌ సర్వీసెస్‌ జూన్‌ 25న నిర్వహించిన సమావేశంలో ఆమోదించింది. ఈ నిధులు అమెజాన్‌ సింగపూర్‌ నుంచి వచ్చినట్లు వ్యాపార పరిశోధనా ప్లాట్‌ఫామ్‌ టోఫ్లర్‌ తెలిపింది. దేశీయంగా మౌలిక వసతులను మరింత విస్తృతం చేసేందుకు అమెజాన్‌ చేస్తున్న యత్నాలకు సాయం చేసేందుకు, వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ఈ నిధులు వెచ్చించనుంది.
దేశీయంగా చిన్న, మధ్యస్థాయి వ్యాపారులను కూడా ఆన్‌లైన్‌లోకి తేవడంతో పాటు, భారత్‌లో వివిధ కార్యకలాపాలకు రూ.7500 కోట్లు (100 కోట్ల డాలర్లు) పెట్టుబడి పెడతామని ఈ ఏడాది జనవరిలో అమెజాన్‌ అధిపతి జెఫ్‌బెజోస్‌ ప్రకటించిన సంగతి విదితమే. అంతకుముందు 550 కోట్ల డాలర్ల పెట్టుబడులను సంస్థ భారత్‌కు కేటాయించింది కూడా.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.