close
Array ( ) 1

తాజా వార్తలు

అమెజాన్‌లో కొత్త సేల్‌.. మొబైల్స్‌పై ఆఫర్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరో సేల్‌తో ముందుకొచ్చింది. ఫోన్లపై డిస్కౌంట్‌తో ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌- 2020 సేల్‌ను ప్రకటించింది. నేటి నుంచి (ఫిబ్రవరి 26 నుంచి) ఈ నెల 29 వరకు ఈ సేల్‌ నడవనుంది. ఇందులో మొబైల్‌ ఫోన్లపై డిస్కౌంట్‌తో పాటు నో-కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్‌పై ఆఫర్లను అమెజాన్‌ అందిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డు యూజర్లు 10 శాతం అదనపు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చు.

వన్‌ప్లస్‌ 7టీ 8జీబీ/128జీబీ మొబైల్‌ వేరియంట్‌ అసలు ధర రూ.37,999 కాగా ఈ సేల్‌లో 34,999కే విక్రయిస్తున్నారు.  అదనంగా రూ.8,850 వరకు అదనపు ఎక్స్ఛేంజ్‌ డిస్కంట్‌ పొందొచ్చు. వన్‌ప్లస్‌ 7ప్రో 42,999 (రూ.52,999)కే లభిస్తోంది. ఒప్పో రీనో 10ఎక్స్‌ జూమ్‌ ఫోన్‌ ఎంఆర్‌పీ రూ.55,990 కాగా, రూ.32,990కే విక్రయిస్తున్నారు. శాంసంగ్‌ ఎం30 4జీబీ/64జీబీ వేరియంట్‌ను రూ.11,999 (రూ.16,490)కు, ఆనర్‌20 రూ.22,999 (రూ.35,999), వివో వీ17ప్రో రూ.27,990 (రూ.32,990)కు విక్రయిస్తున్నారు. రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20ప్రో ఫోన్ల కొనుగోలుపై సాధారణం కంటే రూ.3,000 అదనపు ఎక్స్ఛేంజ్‌ విలువను ఈ సేల్‌లో పొందొచ్చు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.