close

తాజా వార్తలు

Airtel: ఔట్‌గోయింగ్‌ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత

దిల్లీ: ఇతర నెట్‌వర్కులకు చేసే కాల్స్‌ విషయంలో అన్‌లిమిటెడ్‌ ప్లాన్లలో ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ టెలికాం ఆపరేటర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 3 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన కొత్త ప్లాన్లలో ఈ మేరకు మార్పు చేసింది. ఎయిర్‌టెల్‌ ఇటీవల తన ప్రీపెయిడ్‌ ప్లాన్ల ధరలను గరిష్ఠంగా 50 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కొత్త అన్‌లిమిటెడ్‌ ప్లాన్లు ప్రకటించింది. 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌పై 1000 నిమిషాలు, 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌కు 3వేలు, 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌పై 12వేల నిమిషాల పరిమితి విధించింది. ఆ పరిమితి దాటిన తర్వాత ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసలు వసూలు చేస్తామని ప్రకటించింది. శనివారం నుంచి అన్‌లిమిటెడ్‌ ప్లాన్లు ఉపయోగించి దేశవ్యాప్తంగా ఏ ఇతర నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా మాట్లాడొచ్చని, ఎలాంటి షరతులూ ఉండబోవని ఎయిర్‌టెల్‌ ట్వీట్‌ చేసింది. ఎయిర్‌టెల్‌తో పాటు వొడాఫోన్‌ ఐడియా, జియో కూడా తమ ప్లాన్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.