close

తాజా వార్తలు

Updated : 29/10/2020 05:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

31 నుంచి అదానీ గ్రూప్‌ చేతికి

3 విమానాశ్రయాల నిర్వహణ
భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ

దిల్లీ: ఈ నెల 31 నుంచి మంగళూరు, వచ్చే నెల 2 నుంచి లఖ్‌నవూ, 11 నుంచి అహ్మదాబాద్‌ విమానాశ్రాయాల్లో కార్యకలాపాలు, నిర్వహణ, అభివృద్ధి వ్యవహారాలను అదానీ గ్రూప్‌ చూస్తుందని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) వెల్లడించింది. దీనికి సంబంధించి ఇప్పటికే విమానయాన మంత్రిత్వ శాఖ ఆ గ్రూపుతో ఒప్పందం (ఎమ్‌ఓయూ) కుదుర్చుకున్నట్లు తెలిపింది. కస్టమ్స్‌, ఇమిగ్రేషన్‌, భద్రత తదితర వ్యవహారాలను ఆ మూడు విమానాశ్రయాల్లో అదానీ గ్రూప్‌ చేపడుతుంది. 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం 6 ప్రధాన విమానాశ్రయాల్ని ప్రైవేటీకరణ చేసిన సంగతి తెలిసిందే. లఖ్‌వూ, అహ్మదాబాద్‌, జయపుర, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి ఇందులో ఉన్నాయి. బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొన్న అదానీ గ్రూప్‌ ఈ విమానాశ్రయాల నిర్వహణకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.