close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోలుకుంటున్నాం

కరోనా రికవరీలో తెలుగు రాష్ట్రాలు భేష్‌
జాతీయ సగటు కంటే మెరుగ్గా ఏపీ, తెలంగాణ
దేశంలో కొత్తగా 6,535 మందికి కరోనా

ఈనాడు, దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగాన్ని మోగిస్తున్న కొవిడ్‌ మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో కొంతమేరకు నియంత్రణలోనే ఉన్నట్లు కనిపిస్తోంది! రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారిలో కోలుకున్నవారి శాతం ఎక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో రికవరీ రేటు జాతీయస్థాయి కంటే 20 శాతం ఎక్కువగా ఉంది. దేశంలో తాజాగా 24 గంటల్లో 6,535 మంది కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఒక్కరోజులో 2,770 మంది కోలుకున్నారు. 146 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో ఇప్పటివరకు 1,45,380 మందికి వైరస్‌ సోకింది. అందులో 60,491 మంది కోలుకున్నారు. అంటే రికవరీ రేటు 41.60 శాతం. మరణాల శాతం 2.86గా ఉంది. భారత్‌తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా మరణాల శాతం(6.4%) ఎక్కువగా ఉంది. తెలంగాణలో మంగళవారం రికవరీ రేటు 64.49%గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రికవరీ రేటు 63.79 శాతం. మరణాల శాతం తెలంగాణలో 2.86గా, ఏపీలో 1.91గా ఉంది. కోలుకున్నవారి శాతం పంజాబ్‌లో అత్యధికంగా ఉంది.

వరుసగా ఐదో రోజూ 6 వేలకుపైనే..
వరుసగా ఐదో రోజూ ఆరు వేలమందికిపైగా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. దాదాపుగా ప్రతిరోజూ మూడు వేలకుపైగా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో తాజాగా 2,436 మాత్రమే వెలుగుచూడటం కొంతమేరకు ఊరటనిచ్చే అంశం. తాజాగా ఒడిశాలో 102 కేసులొచ్చాయి. తమిళనాడు, దిల్లీ, గుజరాత్‌లలో 400-800 వరకు కేసులు నమోదయ్యాయి. తాజా మరణాల్లో 72% మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌లలోనే ఉన్నాయి.

మరణాలు తక్కువుండటం ఆశ్చర్యమే: బలరాం భార్గవ
కరోనా దెబ్బకు మరణిస్తున్నవారి శాతం దేశంలో తక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ అన్నారు. అందుకు కారణాలను మాత్రం ప్రస్తుతానికి స్పష్టంగా చెప్పడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ స్పందిస్తూ.. బాధితులను ప్రాథమిక స్థాయిలోనే  గుర్తించి చికిత్స అందించడమే మరణాల రేటు తక్కువగా ఉండటానికి కారణమన్నారు. దేశంలో మార్చిలో రికవరీ రేటు 7.1%గా ఉండగా.. లాక్‌డౌన్‌-2 ప్రారంభమయ్యే నాటికి 11.42 శాతానికి, లాక్‌డౌన్‌-3 మొదలయ్యే నాటికి 26.59 శాతానికి పెరిగిందన్నారు. ప్రస్తుతం 41 శాతాన్ని దాటిందని చెప్పారు. ప్రపంచంలో ప్రతి లక్ష మందిలో 4.5 మంది చనిపోతుంటే, భారత్‌లో 0.3% మంది చనిపోతున్న సంగతిని గుర్తుచేశారు. లాక్‌డౌన్‌, వైద్య సదుపాయాల అందుబాటు, భౌతిక దూరం పాటించడం, కంటెయిన్‌మెంట్‌ చర్యలే అందుకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు.


 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.