close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆగస్టు 26న 15 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం

మొదటి విడత పట్టణాలు, నగరాల్లో..

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 26న 15,03,801 ఇళ్ల నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకం కింద రానున్న నాలుగేళ్లలో 27 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా మొదటి విడత నిర్మించే 15 లక్షల ఇళ్లపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు. వీటిని లబ్ధిదారే ఇల్లు నిర్మించే (బీఎల్‌సీ) పథకం కింద పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థ(యూడీఏ)ల్లో కడతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక చేయూతనిస్తాయి. ఒక్కో ఇంటికి కేంద్రం రూ.లక్షన్నర సాయం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే రాయితీపై స్పష్టత రావాల్సి ఉంది.

ఒక్కో చోట 10 నుంచి 10 వేల వరకు ఇళ్లు
ప్రభుత్వం ఉచితంగా స్థలమిచ్చి ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. దీనికి అనుగుణంగా రెవెన్యూ అధికారులు స్థలాలను ఎంపిక చేస్తారు. వీటిలో న్యాయపరమైన ఇబ్బందులు లేనివి, ఇళ్ల నిర్మాణానికి విద్యుత్‌, నీటి సౌకర్యం అందుబాటులో ఉన్న స్థలాలను మొదటి విడత ఇళ్ల నిర్మాణాలకు ఎంపిక చేశారు. ఒక్కో చోట 10 నుంచి 10 వేల వరకు ఇళ్లు నిర్మించనున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.