close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మండలి సెలెక్టు కమిటీపై రాష్ట్ర ప్రభుత్వానికి, శాసనసభ కార్యదర్శికి నోటీసులు

ఈనాడు, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను సెలెక్టు కమిటీకి పంపుతూ శాసనమండలి నిర్ణయం తీసుకున్నా ఇప్పటివరకు పంపకపోవడాన్ని, కమిటీనే ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శాసనసభ కార్యదర్శి (శాసనమండలి కార్యదర్శి ఇన్‌ఛార్జి), సహాయ కార్యదర్శి, కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులకు నోటీసులు జారీచేసింది. విచారణను జూన్‌ 22కి వాయిదా వేసింది.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఉన్నం మురళీధరరావు, ప్రభుత్వం తరఫున న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను సున్నితంగా తోసిపుచ్చారు.

నోటీసులు.. చెంపపెట్టు: దీపక్‌రెడ్డి
‘అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు హైకోర్టు నోటీసులివ్వడం చెంపపెట్టు’ అని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘కార్యదర్శి చేసింది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇందుకు ప్రతిగా పదవీ విరమణ చేయాల్సిన కార్యదర్శిపై ఎలాంటి చర్యా తీసుకోవద్దని, ఏడాదిపాటు ఆయన పదవీకాలం పొడిగిస్తామని ప్రభుత్వం చెప్పడం క్విడ్‌ప్రో కో కాక మరేంటి?’ అని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.