close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తిరుపతి స్విమ్స్‌లో ‘ప్లాస్మా’ చికిత్స

ఐసీఎంఆర్‌ ఆమోదం

ఈనాడు, అమరావతి, తిరుపతి: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌)లో ప్లాస్మా చికిత్సను ప్రారంభించేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ఆమోదం తెలిపింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్లాస్మా థెరపీ చేసే మొదటి ఆసుపత్రిగా స్విమ్స్‌కు అవకాశం లభించింది. స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంగమ్మ మాట్లాడుతూ ‘వైరస్‌ బారినపడి స్విమ్స్‌ నుంచి డిశ్ఛార్జి అయిన వారిలో 8 మంది నుంచి ఇప్పటికే ప్లాస్మా సేకరించాం. మరో నలుగురు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం స్విమ్స్‌లో ముగ్గురికి చికిత్స చేసేందుకు అవకాశం ఉంది. నిర్ణీత ప్రమాణాల మేరకు చికిత్సలు మొదలుపెడతాం’ అని అన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.