close

ప్రధానాంశాలు

పరిష్కారం.. 0.9 శాతమే!

ఇదీ సాదా బైనామా భూముల దరఖాస్తుల పరిష్కార తీరు!

‘‘సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణకు 3.73 లక్షల దరఖాస్తులు వస్తే.. 3,277 (0.9%) మాత్రమే పరిష్కరించడం ఏమిటి? 70% తిరస్కరిస్తే ఎలా? రికార్డుల స్వచ్ఛీకరణ ద్వారా ఈ దరఖాస్తులను మరోమారు పరిశీలించి అర్హులకు న్యాయం చేయండి‘’ అని భూ పరిపాలన శాఖ అధికారులను ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) ఆదేశించారు.

ఈనాడు, అమరావతి: జిల్లాస్థాయిలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి ఇదో నిదర్శనం. సన్న, చిన్నకారు రైతుల సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ కోసం గత ఏడాది అక్టోబరు 10న ఉత్తర్వులు వెలువడ్డాయి. 2.5 ఎకరాల మాగాణి లేదా ఐదు ఎకరాల మెట్ట, 1.25 ఎకరాల మాగాణి లేదా 2.5 ఎకరాల మెట్ట భూమి ఉన్నవారు సన్నకారు రైతులై ఉండి.. 2014 జూన్‌ 2 నాటికి ముందు జరిగిన అన్‌ రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌ (తెల్లకాగితాలపై రాసుకున్న) ఒప్పందాలను క్రమబద్ధీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా 3,73,285 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఈనెల 20 వరకు 3,277 దరఖాస్తులనే అధికారులు పరిష్కరించారు.

దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినా ప్రభుత్వం పరిష్కార చర్యలకు కాలపరిమితిని విధించకపోవడం, అధికారులు తగిన శ్రద్ధ తీసుకోకపోవడంతో క్రమబద్ధీకరణ చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. ఏడాది నుంచి ఈ తంతు కొనసాగుతోంది. దరఖాస్తులను తిరస్కరిస్తే పునఃపరిశీలన కోసం ఏ స్థాయి అధికారిని కోరాలన్నదానిపై స్పష్టత కొరవడింది. ప్రస్తుతం చేపట్టిన రికార్డుల స్వచ్ఛీకరణ ద్వారానైనా ఈ దరఖాస్తులను పునఃపరిశీలించాలని ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ జారీచేసిన ఆదేశాలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖ జిల్లాస్థాయి అధికారులను ఆదేశించింది.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.