close

ప్రధానాంశాలు

5 నిమిషాలే ఆయువుపట్టు

అత్యవసర వైద్యం అందితేనే రోగి ప్రాణాలకు భరోసా
తక్షణ సాయం అందించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం
కమిటీ సభ్యుడు డాక్టర్‌ టీఎస్‌ రవికుమార్‌తో ‘ఈనాడు’ ముఖాముఖి

* ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నాలుగున్నర గంటల వ్యవధిలో 3 ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొంది పెద్దాసుపత్రిలో చేరాడు. అప్పటికే కోమాలోకి వెళ్లాడు. వైద్యులు ‘బ్రెయిన్‌డెడ్‌’గా ప్రకటించారు. కుటుంబ ఔదార్యంతో అతడి అవయవాలు మరికొందరికి కొత్త జీవితమిచ్చినా యువకుడి ప్రాణాలైతే దక్కలేదు.

* అత్యవసర సేవలపై వైద్యుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ముందుచూపుతో తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలే విలువైన ప్రాణాలను కాపాడతాయి. వర్షం కురిసినప్పుడు జారిపడకుండా విమానాశ్రయ అధికారులు నాన్‌స్కిప్‌ రబ్బరు ర్యాంపులను వాడతారు. ఇలాంటి జాగ్రత్తలను ప్రభుత్వ, ప్రైవేటు వైద్యాలయాలన్నింటిలోనూ తీసుకోవాలి.

ఈనాడు, అమరావతి: అత్యవసర సమయాల్లో రోగులకు తగిన వైద్యం అందడం లేదని, దీన్ని తక్షణం సరిదిద్దాలని వైద్య నిపుణుడు డాక్టర్‌ టీఎస్‌ రవికుమార్‌ అన్నారు. 5 నుంచి 10 నిమిషాలలోపు తక్షణ వైద్య సేవలు అందాలని సూచించారు. రోగుల సంరక్షణపై అన్ని దేశాలకు దిశానిర్దేశం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉపక్రమించిందని తెలిపారు. ప్రపంచ నలమూలల నుంచి 8 మంది వైద్య నిపుణులతో ఏర్పాటైన కమిటీ ఇటీవల లండన్‌లో సమావేశమై ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించింది. ఈ కమిటీలో డాక్టర్‌ రవికుమార్‌ సభ్యుడు. మంగళగిరి ఎయిమ్స్‌ అధ్యక్షుడిగానూ ఆయన సేవలందిస్తున్నారు. విజయవాడలో ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
* సత్వర వైద్యసేవలు అందించడంతోపాటు ఆసుపత్రిలోకి వచ్చినప్పటి నుంచి సురక్షితంగా ఇంటికి పంపించడమే రోగి సంరక్షణ. ఈ విషయంలో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. వైద్య సేవల విషయంలో అనాలోచిత నిర్ణయాలు తగవు. పదేళ్లలో ఆసుపత్రుల్లో అత్యధిక మరణాలకు అత్యవసర వైద్య సేవలు అందకపోవడమే కారణమని తేలింది. ప్రతి ఆరోగ్య కేంద్రంలో అత్యవసర వైద్యం కనీస స్థాయిలో అందుబాటులో ఉండాలి. లేకపోతే విలువైన క్షణాల్లో క్షతగాత్రులు, రోగులు విపత్కర పరిస్థితులకు చేరువవుతారు. వ్యయప్రయాసలు పెరుగుతాయి. కుటుంబాలు రోడ్డున పడతాయి. అత్యవసర వైద్య సేవలందించేందుకు రోగులను ఒకచోట నుంచి మరో చోటకు తిప్పే విధానానికి స్వస్తి పలకాలి.
* అభివృద్ధి చెందిన దేశాల్లో రోగి సంరక్షణ సంతృప్తికరంగానే ఉంది. చాలా దేశాల్లో అస్తవ్యస్త పరిస్థితులే ఉన్నాయి. ఈ లోపాలను నివారించేందుకు అత్యవసర వైద్య సేవల కోర్సులు అందుబాటులోకి తేవాలి.బోధన నిపుణులనూ చైతన్యపరచాలి. రోగ నిర్ధారణ పరీక్షలను అవసరానికి అనుగుణంగా, పారదర్శకంగా చేపట్టి వాటి అవసరంపై రోగులకు నమ్మకం కలిగించాలి.

నేపథ్యం
డాక్టర్‌ టీఎస్‌ రవికుమార్‌(సర్జన్‌) ఇటీవలి వరకు తిరుపతి స్విమ్స్‌ సంచాలకులుగా ఉన్నారు. అంతకుముందు జిప్‌మర్‌ సంచాలకులుగా వ్యవహరించారు. అమెరికాలోనే కాకుండా మన దేశంలో 20 ఏళ్ల నుంచి వైద్య రంగంలో సేవలందిస్తున్నారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.