close

ప్రధానాంశాలు

జీవ గడియారానికి తగిన తిండితో మధుమేహం దూరం

వాషింగ్టన్‌: జీవ గడియారం తీరుకు తగ్గట్టు భోజనం చేస్తే మధుమేహాన్ని కట్టడి చేయవచ్చని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. పిండి పదార్థాలు అధికంగా ఉండే అల్పాహారాన్ని ఉదయాన్నే తీసుకోవడం, రాత్రివేళ స్వల్ప స్థాయిలో భోజనం చేస్తే ఈ రోగుల్లో ఎక్కువ మందికి ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు, ఇతర ఔషధాలు తీసుకోవాల్సిన అవసరం తప్పుతుందని చెప్పారు.

ఉదయం వేళ పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తినడానికి; సాయంత్రం, రాత్రివేళ పరిమిత భోజనానికి అనువుగా మన జీవ గడియారం, జీవక్రియలు ఉంటాయని పరిశోధనకు నాయకత్వం వహించిన డేనియాలా తెలిపారు.  ‘‘మధుమేహ రోగులకు సూచించే సంప్రదాయ ఆహారంలో రోజుకు ఆరు స్వల్ప స్థాయి భోజనాలు ఉంటాయి. దీన్ని ‘6ఎం- డైట్‌’గా పేర్కొంటారు.  షుగర్‌ నియంత్రణలో ఇది సమర్థంగా పనిచేయడంలేదు. అందువల్ల రోగులు అదనంగా ఇన్సులిన్‌ తీసుకోవాల్సి వస్తోంది’’ అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ‘3ఎం-డైట్‌’ వల్ల ప్రయోజనం ఉంటుందని తమ పరిశోధనలో తేలిందన్నారు. ఇందులో ఉదయాన్నే బ్రెడ్‌, పండ్లు, స్వీట్లు తీసుకోవాలని మధ్యాహ్నం గణనీయ స్థాయిలో భోజనం చేయడం, రాత్రివేళ మాత్రం పిండి పదార్థాలు, స్వీట్లు, పండ్లు లేని చిన్నపాటి భోజనం ఉంటుందన్నారు. ఈ ఆహారం వల్ల మధుమేహ రోగుల్లో బరువు, చక్కెర స్థాయి గణనీయంగా తగ్గినట్లు చెప్పారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.