
వారి చేతుల కష్టం ఎందరికి సాయమై నిలిచిందో.. మరెందరికి జీవితాల్నిచ్చిందో.. ఇన్నేళ్ల బతుకుచిత్రం ఎన్ని మార్పుల్ని చూసిందో.. గుండె గదుల్ని తడిపేస్తూ కన్నీరు జాలువారే కథలు ఆ మనసుల్లో ఎన్నెన్ని దాగున్నాయో... ఇప్పుడా పండుటాకుల్ని దయనీయ స్థితి చుట్టుముట్టింది. సొంతవారికి బరువైన వారి దుస్థితిని చూస్తే మనిషితత్వం చలిస్తుంది. మానవత్వం విలపిస్తుంది. ఓ వృద్ధురాలిని రెండు నెలల క్రితం ఎవరో కర్నూలు సర్వజన ఆసుపత్రిలో వదిలేశారు. ఆమె కాలికి ఉన్న గాయానికి ఆసుపత్రి సిబ్బంది కట్టు కట్టి చికిత్స చేశారు. అప్పటి నుంచీ ఆమె ఆసుపత్రి మందుల కౌంటర్ దగ్గర దీనంగా గడుపుతున్నారు తన వివరాల్ని చెప్పే స్థితిలో లేరామె. ఒంటిపై ఈగలు ముసురుతున్నా తోలుకునే ఓపికైనా లేక మూలుగుతున్నారు. కర్నూలులోని ఇందిరాగాంధీనగర్ వాసి చెంచన్నదీ ఇదే పరిస్థితి. సొంతవారెవరూ ఆదరించక అనారోగ్యం పాలయ్యారు. ఎడమ కాలికి గాయమై నడవలేని స్థితి. పదిరోజులుగా కర్నూలు డిగ్రీ కళాశాల సమీపంలో ఉంటున్నారు. ఆదరించేవారి కోసం ఎదురు చూస్తున్నారు.
- ఈనాడు, కర్నూలు
కథనాలు
దేవతార్చన

- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!