close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78) శనివారం కన్నుమూశారు. హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. జులై 29న అనారోగ్యంతో నిమ్స్‌లో చేరిన ఆయనకు పరీక్షలు చేయగా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నంది ఎల్లయ్య రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఎదిగారు. ఆయన మృతి పట్ల ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీఆజాద్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ముషీరాబాద్‌ రాంనగర్‌కు చెందిన నంది నాగయ్య, నర్సమ్మలకు 1942 జులై 1న నంది ఎల్లయ్య జన్మించారు. చెన్నారెడ్డితో పాటు 1969లో తెలంగాణ తొలితరం ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 1979లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్సీ స్థానమైన సిద్దిపేట నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 7వ, 9వ, 10వ, 11వ లోక్‌సభలకు అక్కడి నుంచే ప్రాతినిథ్యం వహించారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. తర్వాత కొద్ది రోజులకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ (ఎస్సీ) స్థానం నుంచి పోటీ చేసి 16వ లోక్‌సభలో అడుగుపెట్టారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసిన ఆయనకు 2019లో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపీ టికెట్‌ ఇవ్వకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా ఉంటున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.