close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్మార్ట్‌ఫోన్లతో చిన్నారుల మెదడుపై ప్రభావం

‘ఇ-రక్షాబంధన్‌’లో సైబర్‌ నిపుణుల వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: స్మార్ట్‌ఫోన్లను ఎనిమిదేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులు వినియోగించకూడదని, అది వారి మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందని సైబర్‌ నిపుణుడు నల్లమోతు శ్రీధర్‌ సూచించారు. ఏపీ సీఐడీ నిర్వహిస్తున్న ‘ఇ- రక్షా బంధన్‌’ కార్యక్రమంలో భాగంగా ‘డిజిటల్‌ పేరెంటింగ్‌- నీడ్‌ ఆఫ్‌ ది అవర్‌’ పేరుతో బుధవారం నిర్వహించిన వెబినార్‌లో శ్రీధర్‌ మాట్లాడారు. చిన్నారులకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వడానికి బదులుగా తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయాన్ని గడపాలన్నారు. వెబినార్‌లో దాదాపు 3 వేల మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. ‘సామాజిక మాధ్యమాల్లో సురక్షితంగా ఎలా ఉండాలి’ అనే అంశంపై నేడు వెబినార్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.