close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రంలో హక్కుల అణచివేత

ప్రభుత్వ పోకడలపై ప్రజల్లో చైతన్యం రావాలి
మీడియాపై కేసులు పెట్టే జీవోను ఉపసంహరించాలి
గుంటూరు చర్చా కార్యక్రమంలో వక్తల పిలుపు

ఈనాడు, గుంటూరు: పౌరహక్కుల అణచివేత, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటంలో దేశంలోనే ఏపీ అగ్రభాగాన నిలుస్తుందని తెదేపా నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. కోర్టు తీర్పులు, కేంద్రం ఆదేశాలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. ‘మీడియా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థపై దాడులు.. ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరులోని జిల్లా తెదేపా కార్యాలయంలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎంపీ రవీంద్ర కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్నది ప్రతిదీ చట్ట ఉల్లంఘనే అని, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచే ఇది ప్రారంభమైందని విమర్శించారు. కొవిడ్‌-19 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రతిపక్షాలను అణచివేస్తూ, ఇదే సమయంలో జస్టిస్‌ కనగరాజ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తీసుకురావటం అంటే రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటమేనని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థను కించపరిచేలా మాట్లాడటం వైకాపా పాలకులు, నేతలకు పరిపాటైందని వీటిపై ప్రజాస్వామ్యవాదులంతా గళం విప్పాలని పిలుపునిచ్చారు. ఈ విషయమై ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఆచార్య కె.శ్రీనివాసరావు, విద్యార్థి సంఘం నాయకుడు రావిపాటి సాయికృష్ణ, ఆళ్ల హరి, వేగుంగ రాణి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మి తదితరులు హాజరై పలు అంశాలపై గళమెత్తారు. వారి ప్రసంగాల్లో ముఖ్యాంశాలివీ..
* ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించినా, చర్చావేదికల్లో పాల్గొన్నా అక్రమ కేసులు బనాయించి పౌరహక్కులను హరిస్తున్న వైకాపా దమననీతిపై ప్రజాస్వామ్యవాదులంతా ఎలుగెత్తి నినదించాలి. మీడియా హక్కులను హరించేలా ఉన్న జీఓను ప్రభుత్వం ఉపసంహరించుకునేలా పోరాడాలి.
* ఏవైనా కొన్ని తీర్పులు గౌరవప్రదంగా లేకపోతే న్యాయవ్యవస్థ కళ్లు తెరిపించి వాటిని సరిచేసుకునేలా చేయాలి. కానీ వైకాపా ప్రభుత్వం అన్ని తీర్పులనూ తప్పుబట్టడం, న్యాయవ్యవస్థను కించపరిచేలా మాట్లాడటం, న్యాయమూర్తులపై పోస్టింగులు పెట్టి తూలనాడటం పరిపాటిగా మారింది. ఇప్పటివరకు 70 తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి.
మండలి ఛైర్మన్‌ నిర్ణయాలను అమలు చేయకుండా రాష్ట్రప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.