close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వేగేశ్నకు డయానా-2020 పురస్కారం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పిన్న వయసులోనే పల్లె బతుకులకు ఆసరాగా నిలవాలనే ఆలోచన చేసిన హైదరాబాద్‌కు చెందిన వేగేశ్న రిషివర్మ.. డయానా-2020 పురస్కారానికి ఎంపికయ్యాడు. తొమ్మిదేళ్ళ వయసులో సెలవులకు.. తాతయ్య రామరాజు స్వగ్రామానికి వెళ్లినప్పుడు తుపానుతో కళ్ల ముందు కదలాడిన కన్నీటి దృశ్యాలు చూసి అతడు చలించిపోయాడు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామం నాడు ఆ తుపానుతో ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. అప్పటి నుంచి ‘ఆ పల్లెకు నేనేం చేయగలను’ అనే ప్రశ్న అతడితో పాటే పెరిగి పెద్దదైంది. కిందటేడాది హైదరాబాద్‌ ఓక్రిడ్జ్‌ విద్యా సంస్థలో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఐరాసకు అనుబంధంగా పనిచేసే 1 మిలియన్‌ 1 బిలియన్‌ అనే సంస్థ ప్రతినిధులు వచ్చి ‘ఫ్యూచర్‌ లీడర్స్‌’ కార్యక్రమం గురించి వివరించారు. రిషి నాటి కాళ్లకూరు కష్టాన్ని వివరించి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా గ్రామానికి చేయూతనివ్వాలని భావిస్తున్నట్టు చెప్పాడు. ఆ ప్రకారం ‘స్వయంకృషి’ పేరిట అక్కడ ఓ సంస్థను ప్రారంభించాడు. ఆ ఊరివారికి ఇంటి వంటలు తయారు చేసి విక్రయించడం నేర్పాడు. ఇప్పుడది వారికి ఆదాయ వనరైంది. ఈ కృషికి రిషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. బ్రిటన్‌ రాకుమారి డయానా పేరిట ఏటా అందిస్తున్న పురస్కారాల్లో భాగంగా ఈ ఏడాది రోల్‌ ఆఫ్‌ హానర్‌ విభాగంలో ‘డయానా-2020 పురస్కారం’ అతన్ని వరించింది. త్వరలో జరగబోయే వర్చువల్‌ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రకటించనున్నట్లు కమిటీ వెల్లడించింది. ‘డయానా పురస్కారం నేను వెళ్లే మార్గంలో కొత్త ఉత్సాహాన్నందిస్తుంది’ అంటున్నాడు రిషి వేగేశ్న.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.