close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పండగ పూటా పోరుబాట

ఆలయాల్లో మొక్కులు సమర్పించిన అమరావతి రైతులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి, తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: అమరావతి రైతులు, మహిళలు పండగ నాడూ పోరుబాట కొనసాగించారు. తొలి ఏకాదశి సందర్భంగా ఇళ్ల ఎదుట సేవ్‌ అమరావతి అని ముగ్గులు వేసి, ఆలయాల్లో మొక్కులు సమర్పించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు బుధవారం 197వ రోజు కొనసాగాయి. సీఎం జగన్‌ మనసు మారాలని ప్రజలు మందడంలోని వినాయకుని ఆలయానికి చేరుకుని 1080 టెంకాయలు కొట్టారు. కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు ఛైర్మన్‌ జయప్రకాశ్‌ నారాయణ, గుంటూరు జిల్లా పరిషత్తు మాజీ ఛైర్మన్‌ పాతూరి నాగభూషణం సంఘీభావం తెలిపారు. కృష్ణాయపాలెంలో వరసిద్ధి వినాయకునికి 108 టెంకాయలు సమర్పించారు. ఉద్యమంలో అసువులుబాసిన రైతు చింతా సాంబయ్య కుటుంబ సభ్యులను తెదేపా మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ పరామర్శించారు. జులై 4 నాటికి ఉద్యమం 200వ రోజు పూర్తి చేసుకోనుండగా ఆ రోజు మొత్తం ప్రభుత్వ వైఖరిని ట్విటర్‌లో ప్రచారం చేయాలని రైతులు నిర్ణయించారు.

200 నగరాల్లో కొవ్వొత్తులతో నిరసన
ఈనాడు, అమరావతి: రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేపట్టిన ఉద్యమం 200 రోజులకు చేరుకోనున్న సందర్భంగా ప్రపంచంలోని 200 నగరాల్లో ప్రవాసాంధ్రులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలపనున్నారు. అమెరికాలో 182, బ్రిటన్‌లో 8, కువైట్‌లో 7, దక్షిణాఫ్రికాలోని 3పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

అండగా నిలుద్దాం: జయరాం కోమటి
అమరావతి రైతుల పోరాటం 200 రోజులకు చేరుకోనున్న నేపథ్యంలో వారికి మద్దతుగా నిలవాలని ప్రముఖ ఎన్నారై జయరాం కోమటి ప్రవాసులకు పిలుపునిచ్చారు. వివిధ నగరాల్లోని ఎన్నారైలు నిరసనలో పాల్గొనాలన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.