close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రజాభిప్రాయానికి జగన్‌ భయపడుతున్నారెందుకు?: కళా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దేశంలో ఒక రాష్ట్రం ఏర్పడిన తరువాత.. రాజధాని ఇది.. అని నిర్ణయించాక.. మార్చడం ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా..? ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న జగన్‌ ప్రజల వద్దకు వెళ్లి ప్రజాభిప్రాయం తీసుకునేందుకు ఎందుకు భయపడుతున్నారు? అమరావతిపై మాట తప్పి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు?
ఒక్క అడుగూ ముందుకు వేయలేరు: లోకేశ్‌ ట్వీట్‌
రాష్ట్ర రాజధాని నిర్ణయం 5 కోట్ల ఆంధ్రులు చేయాలి. మీ వ్యక్తిగత నిర్ణయాలు పనికిరావు. 48 గంటల సమయం ఇచ్చినా తెదేపా అధినేత చంద్రబాబు చేసిన సవాలును స్వీకరించలేకపోయారు. మూడు రాజధానులపై ప్రజాభిప్రాయం తీసుకోండి. ఇది కూడా చేయం.. మాకు అంత ధైర్యం లేదు.. మా ఇష్టానుసారం పోతామంటే ఒక్క అడుగూ ముందుకు వేయలేరు.
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: సోమిరెడ్డి
3 రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు ఉత్తర్వులపై యథాతథ స్థితి పాటించాలని హైకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నా. ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేవో తెలుసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంది.
ప్రతి నిర్ణయమూ అభాసుపాలు: చినరాజప్ప
ముఖ్యమంత్రి తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ అభాసుపాలవుతోంది. జగన్‌ ప్రభుత్వంలో సలహాదారులేం చేస్తున్నారు? వారిచ్చే సలహాలను సీఎం విస్మరిస్తున్నారా? ఎందుకిలా జరుగుతోంది?
నాడు నమ్మించారు: పంచుమర్తి అనురాధ
అమరావతే రాజధాని అని వైకాపా మ్యానిఫెస్టోలో చెప్పింది. అది తమ పవిత్ర గ్రంథమని జగన్‌ ఎన్నికల ప్రచారంలో నమ్మించారు. మరి ఆ మాటలు ఇప్పుడేమయ్యాయి? మూడు రాజధానులు చేయాలంటే విభజన చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఉంది.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.