close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మా జీవితాలు.. మీ చేతుల్లో

న్యాయం చేయాలని న్యాయమూర్తులకు రైతుల విజ్ఞప్తి
మోకాళ్లపై నిలబడి వేడుకోలు
భారీ మానవహారంలో నిల్చున్న రైతులు, మహిళలు

ఈనాడు డిజిటల్‌- అమరావతి, తుళ్లూరు (గ్రామీణ), న్యూస్‌టుడే: తమకు న్యాయం జరిగేలా చూడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ అమరావతి రైతులు భారీ మానవహారం నిర్వహించారు. మంగళవారం ఉదయం న్యాయమూర్తులు హైకోర్టుకు వెళ్లే సమయంలో సీడ్‌యాక్సెస్‌ రోడ్డుపై వెంకటపాలెం నుంచి ఎమ్మెల్యే భవన సముదాయాల వరకూ రైతులు, మహిళలు, చిన్నారులు వందలాది మంది రోడ్డుకిరువైపులా దాదాపు గంటన్నరకుపైగా మానవహారంగా నిల్చున్నారు. కొందరు రైతులు, మహిళలు మోకాళ్లపై నిలబడ్డారు. మరికొందరు కొంగుచాచి అభ్యర్థించారు. ‘అమరావతిని రక్షించాలి’, ‘మా జీవితాలు.. మీ చేతుల్లో’ పేరుతో ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. మూడు రాజధానుల విధానాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో 231వ రోజు ఆందోళనలు కొనసాగాయి.

అయోధ్య రామయ్యా... నువ్వే కాపాడాలి
రాజకీయ భూతాల నుంచి అమరావతిని కాపాడాలని వేడుకుంటూ తుళ్లూరు, మందడం దీక్షా శిబిరాల్లో రైతులు, మహిళలు హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించారు. అమరావతిని అయోధ్య రాముడు కాపాడాలని ప్రార్థించారు. తుళ్లూరులో హైకోర్టు చిత్రపటం ఏర్పాటు చేసి దానికి హారతులిచ్చారు. బోరుపాలెంలో కొందరు మహిళలు మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు.  వెంకటపాలెం, అబ్బురాజుపాలెం, కృష్ణాయపాలెం, వెలగపూడి, రాయపూడి, బోరుపాలెం, పెదపరిమి, దొండపాడు, అనంతవరం, ఉద్ధండరాయునిపాలెం, నేలపాడు తదితర గ్రామాల్లో ఎక్కడికక్కడ ఆందోళనలు కొనసాగించారు. సాయంత్రం 5 గంటల తర్వాత మందడంలో నిరసనలు కొనసాగిస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు.    5 గంటల తరువాత అనుమతి లేదని పేర్కొంటూ శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించారు. రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో ఇటీవల చనిపోయిన నీరుకొండకు చెందిన మువ్వా ధనకుమార్‌, వెంకటేశ్వరరావులకు మాజీ మంత్రి దేవినేని నివాళులర్పించారు.

ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు
తమను మోసం చేశారంటూ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(మంగళగిరి)పై రైతులు, పలువురు నియోజకవర్గ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.‘ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజధాని ఎక్కడికీ తరలిపోదు. ఇక్కడే ఉంటుందని హామీ ఇచ్చారు. ఆయన మాటలు నమ్మి వైకాపాకు ఓట్లేశాం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట మార్చి మాకు ద్రోహం చేశారు...’ అని పేర్కొన్నారు. మంగళగిరి, మంగళగిరి గ్రామీణ, తాడేపల్లి, దుగ్గిరాల పోలీస్‌స్టేషన్లలో  వేర్వేరుగా చేసిన ఫిర్యాదుల్లో ఆళ్లపై చీటింగ్‌ కేసు నమోదు చేయాలని కోరారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.