close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మళ్లీ ప్రజాతీర్పు కోరాలి

సీఎం జగన్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సవాల్‌
గవర్నర్‌ వైదొలగాలని డిమాండ్‌

ఈనాడు-గుంటూరు: మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైకాపా తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి తిరిగి ప్రజాతీర్పు కోరాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్‌ చేశారు. తక్షణమే అసెంబ్లీని రద్దు చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్‌ విసిరారు. ‘జీఎన్‌ రావు కమిటీ నివేదిక రాక మునుపే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అసెôబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసి మోసకారి సీఎôగా మిగిలిపోయారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలి...’ అని ఆయన డిమాండ్‌ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులో నిర్వహించిన నిరసనలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘జగన్‌కు అసెంబ్లీలో బలం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరిస్తామనడం సరికాదు. రాజధాని నిర్మిస్తామంటేనే రైతులు భూములు ఇచ్చారు. సాక్షాత్తు ప్రధాని మోదీ వేసిన పునాదిరాయికే దిక్కులేదంటే ఆయన దేశాన్ని ఇంకేం పాలిస్తారు? ఈ మొత్తం నాటకం వెనక భాజపా పాత్ర ఉంది. రెండు బిల్లులను రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదించిన గవర్నర్‌ తన పదవి నుంచి వైదొలగాలి. గుంటూరుకు చెందిన కన్నా లక్ష్మీనారాయణ అమరావతికి మద్దతుగా నిలుస్తారని భావించి ఆయన్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆ బాధ్యతలు వసపిట్టకు అప్పగించారు’ అని వ్యాఖ్యానించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.