close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రగతికోసం వికేంద్రీకరణ తప్పదు

చంద్రబాబు అక్రమాలపై చర్యలు తప్పవు: మంత్రి కన్నబాబు

ఈనాడు, అమరావతి, గుంటూరు: ‘అమరావతి ఉద్యమం.. అందులో నిజంగా 68 మంది మృతి చెంది ఉంటే అందుకు ఏకైక కారకుడు చంద్రబాబే’నని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ‘రైతుల నుంచి దౌర్జన్యంగా భూములు తీసుకున్న చంద్రబాబు.. వారికి స్థలాలనివ్వలేదు. చెప్పినట్లుగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధీ చేయలేదు. రాజధాని నమూనాల కోసం రూ.800 కోట్లు వెచ్చించి భూములిచ్చిన రైతులకు కనీసం కౌలు చెల్లించలేదు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాకే ఆ రైతులకు కౌలు ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు. శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘అమరావతి ఉద్యమం 29 గ్రామాల నుంచి 3 గ్రామాలకు.. తర్వాత ఇళ్లకు, ఇప్పుడు ఫొటోలకు పరిమితమైన వాస్తవం స్థానికంగా ఉంటున్న ప్రజలకు తెలుసు. అమరావతి ఉద్యమం వేరు.. అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన అక్రమాలపై మాత్రం చర్యలు తప్పవు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికార వికేంద్రీకరణ ఉంటుంది. రాష్ట్ర విభజన సమయంలోనూ పెద్దగా స్పందించని చంద్రబాబు ఇప్పుడు తన కుటుంబీకులతో సహా అమరావతి ఉద్యమం పేరుతో రోడ్లపైకొచ్చారు. ఆయన సతీమణి గాజులను విరాళమిచ్చారు. చంద్రబాబుకు స్టేట్‌ కంటే రియల్‌ఎస్టేటే ప్రధానమనేందుకు ఇదే నిదర్శనం. ఉద్యమంలో పాల్గొంటున్నవారు 200 రోజులైన సందర్భంగానైనా చంద్రబాబు నైజాన్ని గుర్తించాలి’ అని సూచించారు. ముద్రగడ పద్మనాభం మనోభావాలను ప్రభుత్వం తగిన రీతిలో అర్థం చేసుకుంటుందని మంత్రి చెప్పారు.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షా?: మంత్రి సుచరిత
రాజధాని అమరావతి 29 గ్రామాల ప్రజలకే కాదు.. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ‘రాజధాని అమరావతిని అంత గొప్పగా అభివృద్ధి చేసి ఉంటే ఆ ప్రాంతంలోనే చంద్రబాబు తనయుడు లోకేశ్‌ ఎందుకు ఓడినట్లు? అక్కడే కాదు.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ మీ అభ్యర్థులు ఎందుకు గెలవలేదు’ అని ప్రశ్నించారు. శనివారం గుంటూరులోని తన స్వగృహంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. రాజధాని గ్రామాల ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. తాము చెప్పినట్లుగానే కౌలు పెంచి ఇస్తామని, అభివృద్ధి చేసిన ప్లాట్లను అందిస్తామని స్పష్టం చేశారు.

భ్రమల నాయకుడు: బాబుపై సజ్జల ధ్వజం
కొవిడ్‌ వ్యాప్తితో ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైన ఈ సమయంలోనూ తనకు గ్రాఫిక్స్‌ రాజధానే కావాలంటూ చంద్రబాబులోని భ్రమల నాయకుడు బయటకొచ్చారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.