close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వెలుగుపూలతో సంఘీభావం

ప్రపంచవ్యాప్తంగా అమరావతి ఉద్యమానికి మద్దతుగా 300 నగరాల్లో కార్యక్రమాలు

ఈనాడు, అమరావతి: రాజధానిలో 200 రోజులుగా రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలకు.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఉంటున్న తెలుగువారు మద్దతు పలికారు. వందలాది నగరాల్లో వెలుగుపూల దివ్వెలతో సంఘీభావం ప్రకటించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. ఆయా దేశాల్లోని స్థానిక ప్రభుత్వాలు అనుమతించిన సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నిబంధనలతో రాలేనివారు కూడా ఎంతోమంది ఇళ్లలోనే కొవ్వొత్తులు వెలిగించి.. జై అమరావతి..రాజధానిని కాపాడుకుందాం.. అంటూ ప్లకార్డులు చేతపట్టి నినదించి ఫేస్‌బుక్‌లో పోస్టులు చేశారు. న్యూజెర్సీలో వర్షం కురుస్తున్నప్పటికీ పలువురు ప్రవాసాంధ్రులు ఇళ్ల ముందు సంఘీభావం తెలిపారు. ‘అన్నదాతతో పంతం.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అంతం. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మరోమారు పరిశీలించాలి’ అని పలువురు డిమాండ్‌ చేశారు. జగన్‌ మాట తప్పారు, మడమ తిప్పారని ధ్వజమెత్తారు. అమెరికా, యూకే, ఐర్లాండ్‌, కువైట్‌, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్‌, సౌదీఅరేబియా తదితర దేశాల్లోని అనేక నగరాల్లో ఉన్న తెలుగువారు అమరావతి రైతుల ఆందోళనకు మద్దతు పలికారు.

* అమెరికాలోని 200 నగరాల్లో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించగా.. 230 నగరాల నుంచి స్పందన లభించిందని తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, మన్నవ మోహనకృష్ణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి అమరావతిని రాజధానిగా కొనసాగించేలా చూడాలని కోరారు. అమెరికాలో ఒకేసారి ఒకేరోజు ఇన్ని నగరాల్లో సంఘీభావ ర్యాలీలు నిర్వహించడం ఇదే ప్రథమమని చెప్పారు. రాజధాని రైతుల మనోవేదనను పట్టించుకోకుండా వైకాపా.. వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందని మాగులూరి భానుప్రకాష్‌ తెలిపారు. రైతులకు మద్దతుగా అమెరికాలోని పలు నగరాల్లో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టినట్లు ఆయన వివరించారు.  విద్యుద్దీపాన్ని కనిపెట్టిన ఎడిసన్‌ పుట్టిన నగరంలో ఉంటూ.. కొవ్వొత్తులతో ప్రదర్శన చేయాల్సి రావడం బాధాకరమని న్యూజెర్సీలోని ప్రతినిధులు పేర్కొన్నారు.
* రాజధాని రైతుల పోరాటాలకు సౌదీ అరేబియాలోని ఖొబర్‌ ప్రాంతం నుంచి ప్రవాసీయులు మద్దతు పలికారు.
* ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ నగరంలో యువత ఒక చేత్తో కొవ్వొత్తులు, మరో చేత్తో నినాదాలతో కూడిన ఐప్యాడ్‌లు, ప్లకార్డులు పట్టుకుని సంఘీభావం ప్రకటించారు.
* రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 200 రోజులుగా ఉద్యమిస్తున్న రైతులకు లండన్‌లో ఉంటున్న మంగళగిరి ప్రాంత వైద్య విద్యార్థులు కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.