close

ప్రధానాంశాలు

రైతును విస్మరిస్తే కష్టాలే

గిట్టుబాటు ధర కోసం అమరావతిలో భారీ ప్రదర్శన నిర్వహిస్తా
ఆర్‌ఎస్‌ఎస్‌లో కొందరు త్యాగాలు చేశారు
మదనపల్లెలో పవన్‌కల్యాణ్‌

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు, న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ, పట్టణం: రైతుల కష్టాన్ని 151 మంది వైకాపా ఎమ్మెల్యేలు పట్టించుకోకపోతే.. వారే ఒకరోజు మిమ్మల్ని పొలాల్లో దున్నించి కష్టం విలువ తెలియజేసే రోజులొస్తాయని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, ఫ్యాక్షనిస్టులకు ఆ అవకాశం ఉండబోదని అన్నారు. ‘రాయలసీమలో జనసేన ఆత్మీయ యాత్ర’లో భాగంగా గురువారం మదనపల్లెలో టమోటా రైతులు, చేనేత కార్మికులు, మహిళా సదస్సు, అనంతపురం జిల్లా నాయకులతో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోకపోతే అమరావతిలో భారీ ప్రదర్శన నిర్వహిస్తానని ప్రకటించారు. కార్యకర్తలు సహకరిస్తే పులివెందులకైనా నడిచి వస్తానన్నారు. ‘పార్టీ పెట్టడానికి పాతికేళ్లు ఆలోచించా. మరో 20ఏళ్లు కష్టనష్టాలకోర్చుకునే వారే నాతో ఉండండి. నేను రాజకీయ నాయకుణ్ని. పవర్‌స్టార్‌ అని పిలవొద్దు. ఆస్తులు ఎక్కువైతే పోరాట శక్తి తగ్గుతుంది. ఆశయాన్ని నమ్ముకున్న వారు బలంగా పోరాడతారు. అందుకే నేను ఏ వ్యాపారాలూ చేయడం లేదు. మోదీకి ఒక ఆశయం ఉన్నందునే వ్యాపారాలు లేవు. ఆర్‌ఎస్‌ఎస్‌లోని కొందరు దేశం కోసం దశాబ్దాలపాటు వ్యక్తిగత జీవితాన్ని వదిలేశారు. చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటా. కార్మికుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. సంఘమిత్రలకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలిస్తున్నారే తప్ప భారతి సిమెంటు నుంచి కాదు. వారిని వేధిస్తే తిరుగుబాటు తప్పదు’ అని హెచ్చరించారు. పవన్‌ ప్రసంగానికి ముందు 2019లో రాప్తాడు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సాకె పవన్‌కుమార్‌ మాట్లాడారు. వైకాపా నాయకుల్ని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రసంగంపై పవన్‌కల్యాణ్‌ స్పందిస్తూ.. ‘ఎంత ఆవేదన ఉంటే ఆ మాటలొస్తాయి? నేనూ ఈ వేదికపైనే ఉన్నా. పవన్‌పై కేసులు పెట్టే ముందు నాపైనా పెట్టండి. చంద్రబాబును ఉరి తీయాలని లోగడ జగన్‌ అన్నారు. ఆయనపైనా కేసులు పెట్టండి’ అని అన్నారు. 2019 ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేయాలనుకున్నా నా వైపున బాధ్యతలు మోసేవారు లేక బరిలోకి దిగలేకపోయానని వివరించారు. సాకె పవన్‌ వ్యాఖ్యలపై మదనపల్లె వైకాపా నాయకుడు బీఏ ఖాజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.