
మార్కెటింగ్ శాఖ అధికారులకు సీఎం ఆదేశం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో కిలో రూ.25కే ఉల్లిపాయలు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. రోజుకు 150 మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలన్నారు. మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా నెల రోజులు ఇదే ధరకు అమ్మకాలు కొసాగించాలని సూచించారు. మార్కెటింగ్ శాఖ అధికారులు గురువారం సీఎంను కలిసి ఉల్లి ధరలు పెరగటానికి కారణాలు, అందుబాటులో ఉన్న నిల్వల గురించి వివరించారు. దేశవ్యాప్తంగా ధరలు ఇలాగే ఉన్నాయని తెలిపారు. కర్నూలు మార్కెట్‌కు వచ్చే సరకులో సగాన్ని నేరుగా వేలంలో రైతుల నుంచి కొంటున్నామని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.62- 75 మధ్య ధర ఉందని, వేలంలో కనీస ధర రూ.53 నుంచి రూ.62 మధ్య కొంటున్నామని వెల్లడించారు. రవాణా ఖర్చులు కలిపితే కిలో రూ.70-72 వరకు అవుతోందన్నారు. పేదలపై భారô తగ్గించటానికి కిలోకు రూ.40-45 రాయితీపై రైతుబజార్లలో విక్రయిస్తున్నట్లు చెప్పారు. ధరలు తగ్గే వరకు విక్రయాలు కొనసాగించాలని, ధరల స్థిరీకరణ నిధిని వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు.
* నవంబరు 25 నాటికి రాష్ట్రంలో వేరుసెనగ కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తేవాలని సీఎం మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. అప్పటి వరకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవటానికి 18 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 200 మెట్రిక్ టన్నుల పంట కొన్నామని అధికారులు చెప్పారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో మార్కెట్లో మొక్కజొన్న ధరలుపెరిగాయని వివరించారు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!