close
‘స్విస్‌ ఛాలెంజ్‌’ను రద్దు చేసుకున్నాం

హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
  కృష్ణారావు, ఉండవల్లి వ్యాజ్యాలపై విచారణ మూసివేత

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి స్టార్టప్‌ ప్రాంతం అభివృద్ధి కోసం ఏపీ సర్కారు అనుసరిస్తున్న స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఐవైఆర్‌ కృష్ణారావు, ఏపీఐడీఈ చట్ట నిబంధనలకు విరుద్ధంగా రాజధాని నిర్మాణ పనుల ఒప్పందాలు జరిగినందున వాటిని రద్దుచేయాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు మూసివేసింది. స్విస్‌ ఛాలెంజ్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) కాసా జగన్‌మోహన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై విచారణ జరపాల్సిన అవసరంలేదని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.

సవరణ చట్టాన్ని పునః సమీక్షించే ఉద్దేశం ఉంది
ఏపీఐడీఈ చట్టం-2001కి సవరణ చేస్తూ 2017 ఏప్రిల్‌ 19న ఏపీ న్యాయశాఖ కార్యదర్శి తీసుకొచ్చిన ‘సవరణ చట్టం-3/2017ను సవాలు చేస్తూ ‘ఫౌండేషన్‌ ఫర్‌ సోషల్‌ అవేర్‌నెస్‌ సొసైటీ’ సభ్యులు వై.సూర్యనారాయణ మూర్తి గతేడాది దాఖలు చేసిన పిల్‌పై విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. ఆ సవరణ చట్టాన్ని ‘పునః సమీక్షించే’ ఉద్దేశం ఉందని, ఆ చట్టానికి సవరణ చేస్తూ అవసరాన్నిబట్టి కొత్త శాసనం తీసుకొస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ప్రమాణపత్రం దాఖలు చేశారు. ప్రాజెక్టుల విషయంలో పారదర్శకతే పరమావధిగా, ప్రాజెక్టులను క్రమబద్ధం చేసేందుకు ‘ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(న్యాయ సమీక్ష ద్వారా పారదర్శకత) చట్టం-2019ని తీసుకొచ్చామన్నారు. రూ.100 కోట్ల ఖర్చు పైబడిన ప్రాజెక్టులపై న్యాయ సమీక్ష చేస్తారన్నారు. హైకోర్టు విధులు సక్రమంగా జరిగేందుకు కావాల్సిన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం వివరాలు సమర్పించేందుకు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.